Categories
జల్లులతో పాటు బోలెడు వ్యాధులను కూడా తనతో తీసుకొస్తుంది వర్షాకాలం. వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు ముప్పేట దాడి చేస్తాయి. మన సంగతి పక్కన పెడితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వీటికి తోడు దోమలు, కలుషిత నీరు-ఆహారం పిల్లల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెడతాయి.ఇక వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు.. వంటి సీజనల్ సమస్యలు తలెత్తడం సహజం.వర్షాకాలంలో పిల్లల్లో తలెత్తే ఇలాంటి అనారోగ్యాల నుంచి వారిని కాపాడుకోవాలంటే తల్లులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.