దేశం నుంచి ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ సాధించిన మొదటి అమ్మాయిగా వందనా కటారియా పేరు మోగిపోయింది.ఉత్తరాఖండ్‌లో రోషన్‌బాద్‌ అనే చిన్న పల్లె లో దళిత కుటుంబానికి వందనా తండ్రి మల్లయోధుడు నిరుపేద కుటుంబ వారిది.హాకీ స్టిక్‌ కూడా కొనలేని వాళ్ళు ఆమె చెట్ల కొమ్మలతోనే సాధన చేసేది. స్కూల్‌ కోచ్‌ వందన ప్రతిభను గుర్తించటంతో ఆమె సీనియర్‌ జట్లలో చోటు దక్కించుకుంది.జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో దేశం కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. 2016 ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌లో జట్టుకు సారథ్యం వహించి, జట్టును గెలిపించింది. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌.. నాలుగు పాయింట్లతో క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది మన అమ్మాయిల జట్టు. వాటిల్లో మూడు వందనా కటారియావే.

Leave a comment