Categories
ఆరోగ్యాన్ని అందించడంలో సోయాకి చక్కని పాత్ర ఉందంటున్నారు ఎక్స్ పర్ట్స్. పశుమాంసం,పాలీష్ బియ్యం ,గోధుమలకు ప్రత్యామ్నాయం సోయా అంటారు డైటీషియన్లు. సోయా ద్వారా అన్ని రకాల నాణ్యమైన ప్రోటీన్లు అందుతాయి.వీటి ద్వారా అమైనో అమ్లాలు లభిస్తాయి.సోయా ఉత్పత్తుల్లో సోయా ఐసోలేట్స్,సోయా లెసిలిన్స్ ,సోయా నట్స్ ,సోయా బీన్స్ ,సోయా మిల్క్ ,సోయా యాగర్ట్ పేరుతో మార్కెట్లో దొరుకుతాయి.ఎడమేమ్ అనేది ఉడికించి ,ఉప్పుతో కలిపి చిరుతిండిగా తినవచ్చు.సోయాను సూప్ లు,సలాడ్స్ లో కలుపుకుని తినవచ్చు. సోయాసాస్ వాడకం కూడా మంచిదే.ఆవు పాలు బదులు సోయా పాలు వాడటం మొదలుపెట్టవచ్చు.ఈ పాలను ఆల్పహార వంటకాల తయారిలో ఉపయోగించవచ్చు.