ఈ కార్తీకమాసంలో భక్తులు విశేషంగా దర్శనం చేసుకునే శివాలయాల్లో, కేరళ రాష్ట్రంలోని, తిరువనంతపురం సమీపంలో ఉన్న చంగల్  గ్రామంలో ఉన్న శివపార్వతులు ఆలయం ఒకటి. ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల ఎత్తులో నిర్మించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. అరవై ఐదు అడుగుల విస్తీర్ణంలో ఎనిమిది అంతస్తుల నిర్మితమైన ఈ శివలింగానికి ఎన్నో విశిష్టతలున్నాయి.ఇందులో 108 చిన్న శివలింగాలు 64 శివ రూపాలు కనిపిస్తాయి ఒక అంతస్తు కైలాసం పునః సృష్టించారు. మాస శివరాత్రికి ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. చెంగల్ మహేశ్వరం శివలింగం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.

Leave a comment