చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటిస్తే ఆరోగ్యం అంటారు ఎక్సపర్ట్స్.హాండ్ వాష్ అందుబాటులో లేకపోతే నీళ్లలో  ఉప్పు వేసి చేతులు శుభ్రం చేసుకోవచ్చు గాఢమైన వాసనలు వెంటనే పోతాయి. కొన్ని నీళ్ళు లవంగాలు వేసి మరిగించి ఆ నీటి తో చేతులు క్లీన్ చేసుకోవచ్చు.యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చేతులను శుభ్రం చేస్తాయి. నిమ్మచెక్క నీళ్లలో వేసి చేతులు కడుక్కునేందుకు ఉపయోగించవచ్చు రోజుకు రెండుసార్లు ముఖానికి తేనె రాసి పది నిమిషాలు మర్దన చేస్తే ముఖం నిగారింపు తో ఉంటుంది. ఉడకబెట్టిన క్యారెట్ గుజ్జుగా చేసి అందులో తేనె కలిపి ముఖానికి మర్దనా చేస్తే మెరుపు  వస్తుంది.

Leave a comment