Categories
WhatsApp

గర్భిణులకు కూల్ డ్రింక్స్ వల్ల చాలా నష్టం.

గర్భిణిగా వున్నప్పుడు ఇష్టమైనవన్నీ తినమంటారు. ఆమె మనస్సులో మెదిలే ఏ రుచికరమైన పదార్ధమైనా అప్పటికప్పుడు చేసి పెట్టి ముద్దు చేస్తారు. తియ్యగా పుల్లగా వుండేది ఏ వయినా పర్లేదు కానీ శీతల పానీయాలు మాత్రం అంత మంచివి కాదంటోంది తాజా పరిశోధన. వీటి వల్ల పుట్ట బోయే బిడ్డలో మాములు కంటే రెట్టింపు బరువుతో ఉంటున్నారని చెప్పుతున్నారు పరిశోధకులు. కొంత మంది ఇష్టంతో తాగితే కొంతమంది చల్లగా ఎదో ఒక్కటి తాగితే బావుంటుందని తాగేస్తారు. ఈ ప్రభావం వల్ల గర్భినీల్లో జస్టేషినల్ డయాబెటీస్ మొదలై శిశువులో బరువు పెరుగుతుందిట. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్ ష్టిట్యుట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ సంస్థ చేసిన అధ్యాయినం రిపోర్టు ఇది. సాధారనంగా మధుమేహం వున్న తల్లులకు పిల్లలు అధిక బరువుతో వుండకుడక. శీతల పానీయాలు ఇష్టపడే తల్లులకు అంతకన్నా రెట్టింపు బరువుతో పుడుతున్నారట. ఈ మధ్యకాలంలో ఉమ్మినీరు తగ్గిపోవడం గమనించి, ద్రవపదార్ధాలు ఎక్కువగా తిసుకోమంటున్నారు వైద్యులు. గర్భిణీలు నీళ్ళకు బదులు ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కలగా బోయే అనర్ధం ఇది.

Leave a comment