Categories
WhatsApp

చినుకు పడితే ట్రెండ్ మార్చాలి.

వర్షాకాలం వస్తే ఏ డిజైన్, ఎలాంటి రంగు వస్త్రాలు అన్న విషయంకన్నా నేలను టేక్ డ్రెస్ మాత్రం వద్దంటారు స్టైయిలిస్ట్ లు. స్కర్టు, గౌను, ప్యాంటు ఏదైనా సరే మడమ కంటే కాస్త పై భాగానే వుండాలి. తక్కువ బరువుతో వుండే డెనిమ్, లెగ్గింగ్స్ ఎంచుకోవచ్చు. కంప్యూటరైజ్డ్ ప్రింట్స్ బావుంటాయి. పాల్కోడాట్స్ పెద్ద పువ్వులు, ఆకులూ బగుంటాయి. ట్రై అండ్ డ్రై రకాలు హ్యాండ్ పెయింటింగ్స్ వీ, బాందినీ డిజైనర్ బ్రోకెడ్ తరహా దుస్తులు నీటిలో తడిస్తే రంగి దిగి పడిపోతాయి తేలికగా అరిపోవాలి. మట్టి మరకలు ఏదైనా కూడా త్వరగా వదిలేలా వుండాలి. క్రేప్, షిఫాన్, పాలిస్టర్, నైలాన్, ఖాదీ వస్త్రాలకు ఈ ప్రేత్యేకతలన్నీ ఉంటాయి. పూర్తిగా ఒకే రంగులో వున్న డ్రెస్సులు , చీరలు ఈ సీజన్లో బావుంటాయి. లేత పేష్టల్ రంగులు తగ్గించి ముదురు ఛాయల్లో పసుపు, ఎరుపు, కాషాయం, ఆకుపచ్చ, నీలం, నలుపు, వంటివి ఎంచుకొంటే బావుంటుంది. వీటికి జతగా భారీ నగలు అవతల పెట్టి చోకార్ నెక్లెస్ లు కాకుండా, ఇయార్ డ్రాప్స్ , దుద్దులు, కలర్ బీడ్స్, క్రిస్టల్ నగలు ధరిస్తే బావుంటుంది.

Leave a comment