ఒబెన్‌ పేరుతో మధుమిత అగర్వాల్ డిజైన్ చేసిన ఈవీ స్కూటర్లు వచ్చేనెలలో మార్కెట్ లోకి రాబోతున్నాయి. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఓనర్ గా ఆమెకు గుర్తింపు వస్తుంది. ఒబెన్‌ కంపెనీ కో ఫౌండర్ మధుమిత. బెంగళూరులోని ఐపెక్సెల్‌’ అనే టెక్నాలజీ, ఇన్నొవేషన్‌ కన్సల్టేషన్‌ సంస్థ కూడా ఆమెదే. ఒడిశాలోని రూర్కెలాలో మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, బెంగళూరులో ఒక యువ పారిశ్రామిక వేత్తగా ఎదిగారు మధుమిత. ఖరగ్ పూర్ లోని ఐఐటి బెంగుళూరులో ఐ ఐ ఎం చదివారు ఒబెన్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించారు.

Leave a comment