చలికి పాదాలు పగుళ్లు వచ్చి. అందులో మట్టి చేరి చూసేందుకు బాగుండవు. ఈ ఇబ్బంది పోవాలంటే ముందుగా గోరువెచ్చని నీళ్ళలో కొన్ని చుక్కల షాంపూ, నిమ్మరసం, ఉప్పు వేసి ఆ నీళ్లలో పది నిమిషాలు పాదాలను ఉంచాలి. తర్వాత బ్రష్ తో రుద్ది కడిగితే మృతకణాలు పోతాయి. తడిలేకుండా తుడిచి ఒక తెల్లని టూత్ పేస్ట్ లో రెండు ఇ- విటమిన్ క్యాప్సిల్స్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసి సున్నితంగా మర్దన చేయాలి. తర్వాత సాక్స్ లు వేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే పగుళ్లు పోయి పాదాలు మృదువుగా తయారవుతాయి.

Leave a comment