మనకు లెక్కలేనన్ని ఎషన్షియల్ ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి.వీటిలోని సహజ పదార్ధాలు బహుళ ప్రయోజనాలు ఇస్తాయి.ఉదాహరణకు క్యారెట్ సీడ్ ఆయిల్ ఎండవల్ల కలిగే నష్టాల నుంచి కాపాడుతుంది.చెట్లు,పూలు,ఔషధాలు,వేళ్ళు ,బెరడు వంటి వాటి ద్వారా వెలికి తీసే ఈ ఆయిల్స్ తో మూడ్ మెరుగవుతుంది.ఒత్తిడి ,ఆందోళన,డిప్రెషన్ తర్వాత తగ్గిపోతుంది.గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ఎనర్జీ లెవల్ ని పెంచుతుంది.లవెండర్ ఆయిల్ మంచి నిద్ర ఇస్తుంది.ఇలాంటి ఎన్నో ఆయిల్స్ సహజ మార్గంలో వైద్యం వైపుకు మొగ్గుతున్నారు ఈ నాటు యువత. ఎషెన్షియల్ ఆయిల్ ప్రాధాన్యత గుర్తించి ప్రత్యామ్నాయ థెరపీలు ఇష్టపడుతున్నారు.

Leave a comment