ప్రత్యేకమైన సందర్భాన్ని జీవితకాలపు జ్ఞాపకంగా మలుచుకోవాలని యువత కోరుకోవటం సహజం. మరి ముఖ్యమైన పెళ్ళి ఇంకెంత ప్రత్యేకంగా ఉండాలి.ఇప్పుడు పొట్రెయిట్ పెయింటెడ్ చీరెలు,జాకెట్లు పెళ్ళిని ఇంకాస్త ప్రత్యేకం చేస్తున్నాయి. వధువు చీరెలు,జాకెట్ల పైన వధువరుల ఫోటోలు ప్రింట్ చేసి ట్రెండ్ సృష్టిస్తున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. చీరె కొంగు మొత్తం నచ్చిన ఫోటోలే ఇవి వధువరుల వరకే ఆగలేదు. ఇష్టమైన దేవతలు,సినిమా పోస్టర్లు కూడా చీరెల పై డిజైన్లుగా మారుతున్నాయి. పట్టు,ఫ్యాన్సీ సిల్క్ వస్త్ర శ్రేణి ఏదైన ఈ ఫోటో ప్రింట్స్ తో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి.

Leave a comment