Categories
WhatsApp

పడుకునేందుకు పద్దతి ఒక్కటి వుంటుంది.

పాడుకొనే సమయంలో కూడా పద్దతిగా పడుకొవాలంటారు నిపుణులు. గట్టిగా వుండే దిండు కాకుండా తలకింద మెత్తని దిండు వుండాలి. ఒక్కోసారి మెడ నొప్పి బుజాల నొప్పి వస్తాయి. ఇలాంటప్పుడు బోర్లా పడుకోకుండా వెల్లకిల్లా లేదా పక్కకు తిరిగి పాడుకోవాలి. దిండు తప్పనిసరిగా వేసుకోవాలి. లేకపోతే భారం భుజాల పై పడుతుంది. నడుము నొప్పి అయితే వెల్లకిలా పడుకుని దిండుని మోకాళ్ళ కింద పెట్టుకుంటే ఉపసమనంగా వుంటుంది. తలనొప్పి, చెంపలు లాగడం వుంటే చేతులు తల కింద పెట్టుకోకూడదు. శరీరానికి ఇరు వైపులా వుంచుకోవాలి. అప్పుడే తలనొప్పి తగ్గిపోతుంది. బోర్లా పడుకుని తలని దిండులోకి దూర్చి పెట్టుకోవడం సారి కాదు. బోర్లా పడుకోవడం ఎలాంటి నొప్పి విషయంలోనైనా సరైన పోజిషన్ కాదు. దిండు మెత్తగా సౌకర్యంగా వుండాలి. సంవత్సరానికైనా దిండు మార్చేయాలి.

Leave a comment