ఇప్పుడు ఇళ్ళలో ఎక్కువగా నాన్ స్టిక్ ప్యాన్లు పాత్రలే వాడుతున్నారు. దుస్తులు పట్ల ఎంత శ్రద్ధగా జాగ్రత్తగా ఉంటామో ఈ పాత్రల విషయంలో కూడా అలాగే ఉండాలి. వాటిని నాజుగ్గా హాండిల్ చేయాలి.నాన్ స్టిక్ ప్యాన్లు పాత్రలు బాగా వేడిగా ఉన్నప్పుడు నీళ్ళ కింద ఉంచకూడదు. ఇలాచేస్తే కోటింగ్ పోతుంది. బాగా ఆరిపోయాక నీరు పోసినానబెట్టి అప్పుడు క్లీన్ చేయాలి.లిక్విడ్  డిష్ వాష్ లేదా  సాప్ట్ నైలాన్ స్పాంజ్ తో క్లీన్ చేయాలి. స్క్రబ్బింగ్ ప్యాడ్ ,మెటల్ స్పాంజ్ వాడకూడదు. పాత్రల్లో వండేప్పుడు చెక్క లేదా ప్లాస్టిక్ గరిటెలు వాడాలి. పాత్రలు ఎక్కువ వేడి చేయకుండా సిమ్ లో ఉంచి నూనె , పదార్థాలు వేసి వండుకోవాలి.

Leave a comment