బైకులొచ్చాక వేగo అనుభవంలోకి వచ్చాక సైకిళ్ళు మూలపడ్డాయి. అయితే సైక్లింగ్ తో ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. రెండున్నర లక్షల మంది పైన ఐదు సంవత్సరాల పాటు ఈ పరిశోధన జరిగింది. ఆఫీసులకు ఇతర పనులపైన బైక్ మాత్రం ఉపయోగించే వాల్లందరిలోను తలెత్తిన ఆరోగ్య సమస్యలను, అనారోగ్యాలను గుర్తించారు. ఈ పరిశోధనా సారాంశంగా ఏం తేలిందంటే బైక్ బదులు సైకిల్ ఉపయోగిస్తే కాన్సర్ వచ్చే అవకాశం 43 శాతం తగ్గుతుందనీ, అదే విధంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా 36 శాతం తగ్గుతుందనీ వారు చెపుతున్నారు. అకాల మరణాలు కూడా 40శాతం తగ్గుతాయని గుర్తించారు. అంతే కాదు సైకిల్ ఉపయోగించే వారిలో ఊబకాయం, చక్కర వ్యాధి తక్కువగా కనిపిస్తాయని అంటున్నారు. సైకిల్ వాడకం వల్ల ఇంధనపు పొదుపు మాత్రమే కాక వాతావరణ కాలుష్యం కూడా లేకుండా ఉంటుందని , ఆరోగ్యం ఎంతో మెరుగ్గా వుంటుందనీ పరిశోధకులు సూచిస్తున్నారు.

Leave a comment