ఇళ్ళల్లో ఇత్తడి, రాగి, వెండి పాత్రలుంటాయి. అవి కొన్నాళ్ళు వడకపోయినా నల్లగా పాత వాటిలా అయిపోతాయి. వెండి వస్తువులు కొత్తవిలా మెరవాలంటే, ఒక స్పూన్ బేకింగ్ సోడ, అల్యూమినియం పేపర్ లో చిన్ని ముక్కలు తీసుకుని ఒక లీటరు నీళ్ళు వేసి ఉడకనిచ్చి తర్వాత బయటకి తీస్తే కొత్త వాటిలా మెరుస్తాయి. ఇత్తడి పత్రాలకోసం ఒక్క నిమ్మ చక్కకు. ఉప్పు పట్టించి దానితో తోమితే వుహించాలేనంతగా మెరిసి పోతాయి. రాగి పత్రాల పైన టొమాటో కెచప్ వేసి తోమి గంట సేపు అలా వుంచేసి నీళ్ళతో కడిగేసి చూడండి. టొమాటో కెచప్ లోని వెనిగర్ రాగి పాత్రలు మెరిసేలా చేస్తుంది. ఇక స్వర్ణాభరణాలను గిన్నెలు తోమె లిక్విడ్ లో వేసి ఓ నిమిషం పాటు వుంచి, నీళ్ళతో రుద్దితే మెరిసిపోతాయి. తర్వాత తడిగుడ్డతో తుడిచి ఆరనిచ్చి బద్రం చేసుకోవచ్చు.

Leave a comment