పెండెంట్ జ్యువెలరీ పాతకాలపు నగల కిందే లెక్క ఆరోజుల్లో చక్కని రాళ్ళను ఏ చెట్టు తీగతోనో వేలాడదీసి వేసుకొనేవాళ్ళు . తర్వాత శంఖులు ,రత్నాలు,వచ్చాయి. తర్వాత రాజులు రాణులు బరువైన పతకాలు హారాల్లో ధరించటం చూశాం మన ఆధునిక డిజైనర్లు కు అవే నచ్చాయి. భారీ పతకాలు డిజైన్లు కాస్తా పెండెంట్ల రూపంలో మెరిసిపోతూ అమ్మాయిల మనసు లాగేశాయి. ఇప్పటికి, పెండెంట్ల ఫ్యాషన్ చాలా అందమైన వజ్రాలు పతకాల తో ధగధగలాడే బంగారు చెయిన్లు ఫ్యాషన్ . ముత్యాలు,పచ్చలు ,కెంపులు,రత్నాలు పెండెంట్స్ తో వస్తున్నాయి. దేవత రూపాలు పువ్వుల అందాలు అందమైన నెమళ్ళు చక్కని పనితనంతో అందాల పథకాలై మెరిసిపోతున్నాయి.

Leave a comment