సోయా ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు ఖాయం చేశాక ఇందులో ఎన్నో వెరైటీలు మార్కెట్ లో వెలిశాయి. ఈ సోయాలో వుండే ఓ పోషక పదార్ధం గుండెకు ఎంతో మేలు చేస్తుందని నిపుణుల తాజా పరిశోధనల్లో తేలింది. ఇందులోని ఐసో ఫ్లెవోనిన్లు అనే పోషకాలు గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీన్ని ఆహారంలో భాగంగా తీసుకొంటే ఇందులో ఈక్వల్ అనే పదార్ధం ఉత్పత్తి అవుతుంది. దీని కారణం గానే హృద్రోగ సమస్యలు రావు. ఈ పదార్ధం కారణంగానే రక్తనాళాల్లో కాల్షియo పేరుకోదని గుర్తించారు. జపాన్, చైనాల్లో వాడే సోయా ఉత్పత్తులలో ఈ ఐసో ఫ్లెవోనిన్ల శాతం మిగిలిన దేశాల్లో కంటే ఎక్కువనీ అందుకే వాళ్ళకు గుండె జబ్బులు తక్కువనీ పరిశోధనల్లో తేలింది. అంతేగాక ఈ పోషక పదార్ధం వల్ల మతిమరుపు, ఆస్టియోపోరోసిస్, రొమ్ము ప్రోస్టేట్ కాన్సర్ రాకుండా ఉంటాయట. కాబట్టి ప్రతిరోజు తినే ఆహారంలో సోయా, సోయా ఉత్పత్తులు, కొంచెం మోతాదులో అయినా భాగంగా చేసుకోండి అని చెప్తున్నారు డాక్టర్లు.

Leave a comment