వర్షాకాలంలో కూడా వేడి ఇంకా తగ్గలేదు. గర్భిణీలుగా ఉండే వాళ్లకు ఈ వేడి కూడా సమస్య. ఎండవేడికి తల తిరిగి వికారం, కాళ్లు పట్టేయడం, పాదాల్లో నీరు చేరడం, ఎసిడిటీ వంటి వి బాధిస్తాయి.శరీర ఉష్ణోగ్రత పెరగకుండా తగినన్ని ద్రవ పదార్థాలు తీసుకోవాలి. పండ్ల రసాలు, నీటి శాతం ఎక్కువ ఉండే కీర దోస, పుచ్చకాయ, కర్పూజ తినాలి. స్నానం చేసే నీళ్లు మరి చల్లగా మరి వేడిగా వద్దు. వీలైనంత విశ్రాంతిగా ఉంటే శరీరం మెదడు ఉత్సాహంగా ఉంటాయి.

Leave a comment