పిల్లల చేతిలో మార్కర్ ఉంటే ఇల్లంతా రంగులు అంటుకుంటాయి. చిన్న చిట్కాలతో మరకలు తీసేయవచ్చు లేత వర్ణపు గోడలపై మార్కర్ మరకలు పడితే, చిటికెడు టూత్ పేస్ట్ వేసి మరక ఉన్న చోట రుద్దితే పోతుంది. చెక్క, లెదర్ లపై ఉన్న మరకలు పాలు లేదా ఆల్కహాల్ నాలుగు చుక్కలు వేసి పాత బట్టతో తుడిస్తే పోతాయి. దుప్పట్లు, తలగడ తలపై ఉండే మరకలు శానిటైజర్ చల్లి ఉతికితే పోతాయి. కార్పెట్ పై మరక పడితే వెనిగర్ చల్లితే పోతాయి. గాజు పాత్ర పై మరకలు టూత్ పేస్ట్, వంట సోడా మిశ్రమం తో పోగొట్టవచ్చు.

Leave a comment