– డి.సుజాతా దేవి

గాలి దిట్టే కొట్టెనో
ఊరి కళ్ళెర్రబడెనో
వాలిపోతా వుంది
సోలిపోతా ఉంది
వొడిలినా పువ్వల్లె
వొరిగిపడి వున్నాది!!

కలలోకి రమ్మనీ
కవ్వించి పోయేది
మెలుకు వొచ్చింది
నువ్వెవ్వరని అడిగేది!!

ఎగిరివచ్చేది నా
ఎదట నిలిసేది
మాట సెప్పేతలికి
మాయమై పోయేది!!

మల్లెపూవులు సూసి
మొకము సిట్లిత్తాది
మామిడాకులు దూసి
మనసుగా తింటాది!!

మట్టి పై మనసేటో
మాటాడ యిసుగేటొ
పొద్దుమొక మెరగక
పద్దాక నిదరేటో!!

Leave a comment