కార్పొరేట్ లుక్ రావాలంటే క్రాప్ టాప్ ప్యాంటు వేసుకోవాలి అంటారు డిజైనర్లు.ఇవాల్టి రోజుల్లో చీరలు స్కర్ట్ ల పైన కూడా క్రాప్ టాప్ లాంగ్ కోట్ వేసుకుంటున్నారు. అమ్మాయిలకు ఇవి ఇంతగా నచ్చుతున్నాయి కనుకనే ఈ రెండిటిని కలిపేసి కొత్త ఫ్యాషన్ సృష్టించారు ఆధునిక డిజైనర్లు. క్రాప్ టాప్ ప్యాంట్ విత్ కోట్ ఈ డ్రెస్ సంప్రదాయ వేడుకల్లో వేసుకున్న లేదా సాయంకాలపు పార్టీల్లో వేసుకున్న ఆడంబరంగా అందంగా ఉంటుంది. వెడల్పాటి స్కర్ట్ తో కలిపి వేసుకున్న క్రాప్ టాప్ ఇప్పుడు చక్కని లాంగ్ కోట్ లు నచ్చేసింది. సాదా ప్యాంట్ టాప్ తో అందమైన పువ్వులు డిజైన్ల తో వస్తున్న క్రాప్ టాప్ ఈ తరం అమ్మాయిలకు ఇష్టమైన డ్రెస్ అయిపోయింది. జార్జెట్ పైన ఎంబ్రాయిడరీ చేసిన క్రాప్ టాప్ లేత రంగు ప్యాంట్ షర్ట్ లకు చక్కగా మ్యాచ్ అవుతుంది. ఖరీదైన ఫ్యాబ్రిక్ తో వీటిని ఇప్పుడు వెడ్డింగ్ డ్రెస్ గా కూడా డిజైన్ చేశారు.

Leave a comment