నీహారికా,

ఎప్పుడూ ఎదో ఒక కొత్త పని ఎదురవ్వుతోంది. చడుకోవడం,  వంటరిగా వెళ్ళడం, హాస్టల్ లో వుండటం, కొత్త కొర్సులకు పోవడం అవన్నీ రకరకాల అనుభవాలు. కొత్త పరిచయాలు. కాస్త భయం పోగొట్టుకోవడం చాలా అవసరం. మనం వంటరిగానే ఎన్నో సాధించాల్సిన అంశాలుంటాయి. ఒక పని చేసేటప్పుడు, దీన్ని చేయగలమా లేదా అని ఆలోచించడం కంటే తక్కువ సమయంలో ఎంత సమర్ధవంతంగా పూర్తి చేయవచ్చో ఆలోచించ వచ్చు. దీనితో పనులు సమర్ధవంతంగా పూర్తి చేయవచ్చో ఆలోచించ వచ్చు. దీనితో పనులు వ్యక్తి గతంగా చేయగలగడం తో పాటు మంచి ఫలితాలు కుడా వస్తాయి. ఇతరులు ఎవరో మన శక్తి సమాధ్యాల గురించి మనకు చెప్పే లోపే మనలోపలి శక్తి మనమే గుర్తించాలి. ఏ పని అయినా ఎంత వరకు చేయగలరో అంటే చేయాలి. కానీ పనుల జూలికి వెళ్లొద్దు. వ్యక్తుల విషయంలో కాదు చేసే పని విషయంలో సానుకూల దృక్పదం వుండాలి. ఏ పని అయినా ఛాలెంజ్ గా తీసుకోవాలి. నేను సానుకూల చేయగలను అని నమ్మి చేయాలి. ఆందోళన, వత్తిడికి, భయం, ఈ మూడు కవల పిల్లలు మొదటి రేటింగ్ నీ అధిగమిస్తే మూడవది దానంతట అదే తప్పుకుంటుంది. ఏ వయస్సు అయినా ప్రేశాంతంగా చేయాలి. అప్పుడే త్వరగా అనుకున్న లక్ష్యాన్ని అందుకునే లా పూర్తి చేయొచ్చు. ఎన్నో నేర్చుకుంటూ అనుభవం తో అన్ని తెలుసుకుంటూ, లక్ష్యం అడుగులు వేయడమె కర్తవ్యం.

Leave a comment