అంజనీ పుత్రుడు ఆంజనేయయడని,వాయు పుత్రుడు పవనసుతుడని,బజరంగబలీ  అనీ,కేసరీ నందనుడనీ వివిధ పేర్లతో మనకు హనుమంతుడు దర్శన భాగ్యం కలుగుతుంది. మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో ద్వాదస జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరం వెళ్ళే మార్గంలో మనకు అంజనేరి కొండ కింద ఆంజనేయస్వామి దర్శనం కలుగుతుంది.ఇక్కడ స్వామి జన్మించిన స్థలం అని,మూడు కొండలు దాటి వెళ్తేగానీ స్వామి కొలువున్న కొండకు చేరుకోలేమనీ,భక్తులు హనుమాన్ చాలీశా పారాయణం చేస్తూ కొండ ఎక్కి వస్తారు.గోదావరి నది కూడా ఈ ప్రాంతంలోనే జన్మించినది.మనకు ఆంజనేయ స్వామి అంజనాదేవి ఒడిలో పసిబాలుడిగా దర్శనం ఇస్తారు. నిత్య ప్రసాదం:కొబ్బరి,తమలపాకులు,గారెలు,అప్పాలు            -తోలేటి వెంకట శిరీష

Leave a comment