తమిళనాడులో 32 జిల్లాల్లో ఐదు మహిళా కోర్ట్ లు మాత్రమే ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా ఈ  తరహా న్యాయస్థానాలు కోరుతూ సేవ్ శక్తి పేరుతో కోర్టులో పిటిషన్ వేశారు.మహిళలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కలిసినప్పుడే దీనికోసం 333 కోట్ల బడ్జెట్ ఉంటుందని తెలిసిందే  తర్వాత సేవ్ శక్తి పేరుతో ఎన్జీవో ను ప్రారంభించాను  సమస్యల్లో ఉన్న వారికి న్యాయ, ఆర్ధిక సాయం చేస్తాను అంటోంది నటి వరలక్ష్మి శరత్ కుమార్  సినిమా రంగంలో కూడా మహిళలు ఎదుర్కొనే లైంగిక హింసకు తెర పడాలి ఇందుకోసం  భవిష్యత్తులో ఒక సంస్థను ఏర్పాటు చేస్తాను. ఎవరైనా అక్కడ నుంచి ధైర్యంగా ఫిర్యాదు చేసుకునే ఏర్పాటు చేస్తాను అంటోంది వరలక్ష్మి.

Leave a comment