ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ హెప్సిబా రాణి 2019 లో బెంగళూర్ స్మార్ట్ సిటీ ఎండి గా బాధ్యతలు తీసుకొన్నారు.. కోఠి ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఐ.ఐ.టీ ఢిల్లీలో పి.హెచ్.డీ చేసి రీసెర్చ్ తో పాటు సివిల్స్ కి  ప్రిపేర్ అయ్యారు 20 వ ర్యాంక్ తో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. తొలి పోస్టింగ్  కర్ణాటక  మాండ్వ జిల్లా చామ్ రాజ నగర్, గుల్బర్గా లో స్వచ్ఛ భారత్ మిషన్ తో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించి జాతీయ అవార్డు అందుకున్నారు. బెంగుళూరు నగరాన్ని స్మార్ట్ సిటీ గా తొలిస్థానంలో నిలబెట్టిన ఘనత హెప్సిబా రాణి దే ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో మహిళలు సౌకర్యవంతంగా ఉద్యోగం చేసుకునేలా చైల్డ్ కేర్ టాయిలెట్స్ ఇతర సర్వీసులు అన్నీ ఉండేలా డిజైన్ చేశారు హెఫ్సిబా రాణి కోర్లాపట్.

Leave a comment