కేరళ హైకోర్టు ఉత్తర్వులు హీనా హనీఫా కు అంతులేని ఉత్సాహం ఇచ్చాయి. హనీఫా ట్రాన్స్ జెండర్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది ఎన్.సి.సి లో చేరాలనుకొంది.ఆమె అడ్మిషన్ తిరస్కరించారు అధికారులు కేరళ హైకోర్టులో పిటిషన్ వేసింది హనీఫా. ఆమెను ఎన్.సి.సి బెటాలియన్ తిరస్కరించటం, ట్రాన్స్ జెండర్ పర్సన్స్ చట్టం 2019 ఉల్లంఘన కిందకు వస్తుందని  స్పష్టం చేసింది. ఆమె ఆకాంక్షను కాదనే హక్కు NCC కి లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె పోరాట ఫలితంగా దశాబ్దాల క్రిందటి  NCC చట్టం మారింది.  NCC కేడెట్ లో హీన పేరు చేరింది. నా ఇంకో లక్ష్యం IPS చక్కగా చదువుకుని చరిత్రలో నా పేరు నిలిచిపోయేలా చేస్తా అంటుంది హీనా హనీఫా.

Leave a comment