గుప్పెడు మొలకెత్తిన శనగలు తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలు శనగల్లో ప్రోటీన్స్ ,పీచు చాలా ఎక్కువ .ఇతర ఖనిజాలు విటమిన్లు కూడా ఉంటాయి.ఈ పీచు మలబద్దకం ఉన్నవారికి మంచి మందులాంటిదే. ఈ పీచు ఇన్సులిన్ ను క్రమబద్దికరిస్తుంది. వీటిని తినటం వల్ల కడుపు ఉబ్బరం గ్యాస్ వస్తాయని అనుమానం ఉంటే వీటిని కొద్దిసేపు బేకింగ్ సోడాలో నానబెట్టీ ఆ నీరు వంపేసి వాడుకొంటే ఆ సమస్య ఉండదు. శనగల్లో పోటాషియం పీచు విటమిన్ సి గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఐరన్ కాల్షియం ,మాంగనీస్ ఫాస్ఫరస్ జింక్ ఎముకల వృద్ధికి తోడ్పతాయి.

Leave a comment