రాత్రయ్యాక మూడు గంటలు సెల్ ఫోన్ లో మాట్లాడే వాళ్ళకి సరిగా నిద్రపట్టడం లేదని ఇటీవలే జరిగిన పరిశోధనలో తెలిసింది. సెల్ ఫోన్ నుంచి వెలువడే సూక్ష్మ తరంగాల ఉద్గారాల వాళ్ళ మన ఏడాదిలో తరంగాలు మార్పు చెందుతాయి. 30 నిముషాలు ఫోన్ లో మాట్లాడితే మనం నిద్రపోయే స్థితి సాధించేందుకు మెదడు 60 నిమిషాలు తీసుకుంటుంది. మనలోని జీవ గడియారం సరిగ్గా పనిచేసేందుకు నిద్ర సమయాన్ని మేల్కునే సమయాన్ని నియంత్రించాలి. ఇది కాస్త కష్టమే కానీ  అసాధ్యం మాత్రం కాదు. నిద్ర చాల ముఖ్యం. అలసిన శరీరానికి  విశ్రాంతి దెబ్బతిన్నా శరీర కణాల  పునర్నిర్మాణానికి దోహదం చేస్తుంది. అందుకే ఆల్కహాల్ కు దూరంగా సెల్ ఫోన్ లు దూరంగా టీ వీకి దూరంగా కెఫిన్ కు దూరంగా చిరుతిండి భారీ భోజనం వీటన్నిటినీ  ఒక కన్నేసి చూసి మంచి దిండు పరుపు తీసుకుని పడక గదిని సాధ్యమైనంత చీకటిగా ఉంచి హాయిగా నిద్రపోవాలి. ఈమెయిల్స్ ,ఫేస్ బుక్ ,చాటింగ్ లు నిద్ర దోచుకుని శరీరంలో ప్రతికూలమైన మార్పులు తెస్తాయి జాగ్రత్త !

Leave a comment