Categories
Wahrevaa

కొన్ని కొన్ని తగ్గించి తింటే మేలు.

రకరకాల యాప్, ఏ పుస్తకం తెరిచినా ఎన్నెన్నో సలహాలు, సూచనలు. ఇవన్నీ ముందు పెట్టుకుని నేటి యువతరం పోషకాహారం పేరుతో ఓట్ మీల్, క్వెనోవా, డార్క్ చాక్లేట్ నట్స్ వంటివి అతిగా తినేస్తున్నారు. ఇవన్నీ ఒక పద్దతి అతిగా తినేస్తున్నారు. ఇవన్నీ ఒక పద్దతి ప్రకారం తినకపోవడం కూడా అధిక బరువుకు కారణమే పండ్లు, పుచ్చకాయల్లో మాత్రమే తక్కువ క్యాలరీలు ఉంటాయి. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్ కావాలి. పండ్లు, ధన్యాలు కూడా పోషకాహారంలో భాగం. పీచు కూడా అందాలి. పీనట్ బటర్, చీజ్ తురుము ఒక బుల్లి బంతి ఆహారంలో అంటే ఒక టీ స్పూన్ తినాలి. ఒక ఆరోగ్యకరమైన మహిళ 60 గ్రాముల పప్పు, 50 గ్రాముల మాంసం తీసుకోవచ్చు. అన్నం రాగులు, పాస్తాఏదైనా 270 గ్రాముల నుంచి 300 గ్రాములు, 100 గ్రాముల పల్లీ, 200 గ్రాముల కూరలు తీసుకోవచ్చు. చక్కర రెండు చంచాలు తీసుకోవాలి. బరువు భయంతో అన్నం మానేయటం కన్నా నూనె చక్కర మనేస్తేనే ఎక్కువ ఫలితం. ప్రోటీన్లు నుంచి కొంత, అలా తినే ఆహారం నుంచి కొంత కొంత తగ్గించుకుంటూ అసలు తినేది మాత్రం పోషకాహారంగా ఉండేలా చూసుకుంటే మేలు.

Leave a comment