Categories
అతిగా ఏ పనిచేసిన నష్టమే అంటారు నిపుణులు.ప్రస్థుతం సోషల్ మీడియాలో వాటర్ ఫాస్టింగ్ బరువు తగ్గేందుకు మంచి విధానం అని బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతుంది.ఇంకా ఆహారపదార్ధాలు లేకుండా నీరు,కాఫీ,టీ మాత్రమే తీసుకోవడం వాటర్ ఫాస్టింగ్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ వాటర్ ఫాస్ట్ పేరుతో ఈ ఫాస్టింగ్ ఎంతో మంది ఫాలో అవుతూ ఇతరులను ప్రోత్సహిస్తున్నారు.ఇది వేలాది మంది ఇష్టంగా పాటిస్తున్నారు కూడా. అయితే ఇలా బరువు తగ్గేందుకు చూడటం ప్రాణాలతో చెలగాటం అంటున్నారు ఆహార నిపుణులు. ఇలా నీళ్ళు మాత్రమే తాగితే అనవసరమైన సాహసాలు చేయోద్దు అంటున్నారు.