Categories
మార్కెట్ లో ఎన్నో రకాల హెయిర్ బ్రష్ లు అందుబాటులో ఉంటాయి . శిరోజాల రకాన్ని బట్టి బ్రష్ ఎంపిక చేసుకోవాలి . శిరోజాలకు స్ట్రయిట్ గా,స్మూధీ ఫినిషింగ్ ఇవ్వాలని కొంటే వెడల్పాటి పళ్ళున్న దువ్వెన కావాలి . నైలాన్ పళ్ళున్న దువ్వెన చక్కగా ఉంటుంది . జుట్టు బాగా పల్చగా ఉంటే రౌండ్ హెయిర్ బ్రష్ ఎంచుకోవాలి . దువ్వెన పళ్ళ నడుమ తక్కువ ఖాళీ ఉండాలి శిరోజాలు తిన్నగా ఉంటే ప్లాట్ బ్రష్ బావుంటుంది . దైనందిన వాడకానికి ఫ్యాడిల్ హెయిర్ బ్రష్ సూటవుతుంది . పొడవుగా స్ట్రయిట్ గా ఉన్నా ఈ బ్రష్ సరిపోతుంది ఒవెల్ బ్రష్ స్టయిలింగ్ కు పనికి వస్తుంది . అలాగే మసాజ్ ఉపయోగమూ ఉంటుంది . హెవీగా ఉండే మీడియం లెంగ్త్ ఉన్నా జుట్టుకు ఈ బ్రష్ బావుంటుంది . వెడల్పాటి పళ్ళున దువ్వెనతో దువ్వుకొని చిక్కులు తీసుకున్నాకే దువ్వుకోవాలి .