తల్లులు ప్రతిరోజు అరగంట పాటు పిల్లల చదువు దగ్గర కూర్చుంటే మంచి ఫలితం చూడవచ్చని, వారిలో తెలివితేటలు పెరుగుతాయని చెపుతున్నారు పరిశోధకులు . నాలుగు నుంచి ఏడు సంవత్సరాల పిల్లలతో హోమ్ వర్క్ చేయించడం ,చదివించటం చేస్తే వారిలో తెలివితేటలు వృద్దిచెంది మరింత చురుగ్గా తయారవుతారు అంటున్నారు . తల్లులతో పిల్లలకు సాన్నిహిత్యం ఎక్కువ తల్లి మాటకు విలువ ఇస్తారు . నమ్మకం చూపిస్తారు . ఈ మూడు కారణాలతో తల్లులతో పాటు చదువుకు కూర్చుంటే ఆ అరగంట ఆమె శిక్షణ మనసుకి ఎక్కించుకొంటారని , కాస్సేపు చదువులో గడిపినా ఆ తరువాత ఆమె తమను స్వేచ్ఛగా ఆడుకోనిస్తుందనే నమ్మకం వాళ్ళలో ఉండడం చదివిన అరగంట చదువు ,వాళ్ళ మెదడుకి సూటిగా ఎక్కుతుందని చెపుతున్నారు . పిల్లలతో పాటు ప్లే గ్రౌండ్స్ కూడా తల్లులు గడిపితే వాళ్లలో సోషల్ స్కిల్స్ పెరుగుతాయి అంటున్నారు .
Categories