Categories
నీలంరంగు ఆకలిని తగ్గించే శక్తితో ఉంటుందట . అందుకే బరువు తగ్గాలి అనుకొనేవాళ్ళు ఈ నీలిరంగు కాంతిలో ఆహారం తీసుకోవాలంటారు ఎక్స్ పర్డ్స్ . అలగే ప్రకృతి లో నీలం రంగులు లభించే పూలు పండ్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ . శంఖుపులతో చేసిన టీ నిద్రలేమి ,మతిమరపు ఆందోళన డిప్రషన్ తగ్గిస్తుంది . నీలం రంగు ఆహారం తినే ప్లేట్లో ఎక్కువవుతోంది . నేరేడు ,బ్లూ బెర్రీల్లోని ఔషదాలు మధుమేహం కాన్సర్ వంటి వ్యాధులను అడ్డుకొంటాయని అధ్యయనాలు చెపుతున్నాయి . నీలంరంగులోనే ఎండ వేడిమిని తగ్గించే గుణం కూడా ఉందని ,ఎండ ఎక్కువ పడే గదుల్లో నీలం రంగు పెయింట్ వేస్తే బావుంటుందంటున్నారు .