Categories
థాలీ భోజనం లో ఎన్నో రకాల ఐటమ్స్ ఉంటాయి .పాతికకన్నా ఎక్కువ పదార్దాలతో భోజన ప్రియులకు ఈ స్పెషల్ భోజనం తినటం ఇష్టం .అలాగే ఇప్పుడు ఐస్ క్రీమ్ థాలీ కూడా యువతని హాట్ పేవరెట్ .అచ్చం వెజ్ థాలీ లాగా ఎన్నో రకాల వెరైటీ ఐస్ క్రీమ్ లను చిన్ని చిన్ని గిన్నెల్లో ఇస్తారు .కుటుంబ సభ్యులు సరదాగా వెళ్ళినప్పుడు ఈ ఐస్ క్రీం థాలీ ఆర్డర్ ఇస్తే మాంగో మస్తానీ , గుల్కంర్ , బాదాం హల్వా, రాయల్ డ్రై ఫ్రూట్ వంటి ఎన్నో రకాల ఫ్లేవర్లలో ఒకే సారి ఎన్నో రకాల ఐస్ క్రీమ్ తినవచ్చు .నచ్చిన రుచులు , కొత్త రుచులు రుచి చూడవచ్చు .కానీ హొటళ్ళు అచ్చం గా స్వీట్లతో వివిధ రకలా చాక్లెట్ లతో థాలీ లు చేస్తున్నారు .మొత్తానికి ఈ థాలీ కాన్సెప్ట్ యూత్ ఫెవరెట్ అయిపోయింది .