మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో సప్తశృంగి పర్వతం పైన సప్తశృంగి మాత కొలువై వుంది.
అమ్మవారు 18 హస్తాలతో 18 ఆయుధాలతో కాళికా దేవి రూపంలో దర్శనం ఇస్తుంది.

పురాణ గాథల ప్రకారం మహిషాసురుడిని సంహారం చేయడానికి అమ్మవారికి దేవతలందరూ ఆయుధాలను ఇచ్చారని,ఇక్కడ పులి రాత్రి వేళ కాపలా ఉంటుంది అని ప్రత్యక్ష సాక్షులు చెప్తారు.సప్త అంటే ఏడు కొండలని శృంగి అంటే కొమ్ము అని, ఈ ఏడు కొండలు కొమ్ము ఆకారంలో కనిపిస్తాయి.ఇక్కడ మార్కండేయ మహర్షి దేవీ మహత్యం రచించారు.త్రేతాయుగంలో శ్రీ సీతా రామ లక్ష్మణ సమేతంగ  ఈ అమ్మవారి దర్శనం చేసుకున్నారని భక్తుల నానుడి.

నిత్య ప్రసాదం:కొబ్బరి,ఉడకబెట్టిన శనగలు

              -తోలేటి వెంకట శిరీష

Leave a comment