Categories

చల్లని పాలు తాగుతూ ఉంటే ఉదరంలో ఇబ్బంది పెట్టే ఎసిడిటీ సమస్య పోతుంది అంటున్నారు వైద్యులు. కడుపులో తయారయ్యే యాసిడ్స్ ని పాలు పీల్చుకుంటాయి. కొబ్బరి నీళ్ళు తాగిన సరే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఎసిడిటీ సమస్య ఉపశమిస్తుంది. అరటిపండులోని పోటాషియం పీచు కూడా ఈ సమస్యను తగ్గిస్తాయి. బొప్పాయి,పుచ్చకాలో పీచు యాంటీఆక్సిడెంట్స్ ఎసిడిటీ సమస్య తగ్గిస్తాయి.