Categories
ప్రకృతికి దగ్గరగా ఉండే మహిళల్లో ఊబకాయం కనిపించటం లేదని తాజా అధ్యయనం చెపుతోంది. 2300 మంది మహిళలపై చేసిన అధ్యయనంలో ఎత్తు బరువు తీసుకొనే ఆహారం అన్నిక్రోడీకరించి ఈ రిపోర్ట్ తయారు చేశారు. మహిళలు పచ్చదనానికి దగ్గరగా జీవిస్తూ వుంటే వారి బరువు సాధారణ స్థాయిలో ఉంది. తోటపని చేస్తూ,పచ్చని చెట్ల మధ్య వాకింగ్ మొదలైన వన్నీ మానసిక ఆనందం ఇస్తాయి ఈ కారణం చేత మహిళలు సరైన ఆరోగ్యం తో ఉన్నారని తేలింది. సాద్యమైనంత వరకు మొక్కలకు దగ్గరగా వుండే అలవాటు పెంచుకోమంటున్నారు.