Categories
![బరువు తగ్గాలన్నా, చక్కర వ్యాధి అదుపులో ఉండాలన్నా, రక్తపోటు రాకుండా ఉండాలన్నా మెడిటరేనియన్ డైట్ తీసుకోమంటున్నారు నిపుణులు. ఈ మెడిటరేనియన్ డైట్ లో ఆలివ్ ఆయిల్, పాలిష్ చేయని తృణధాన్యాలు, పళ్ళు, చేపలు ఉంటాయి. వెన్న బదులుగా ఆలివ్ ఆయిల్ లేదా కనోలా ఆయిల్, సాల్ట్ బదులుగా భోజనంలో రుచికోసం హెర్బ్స్ వాడటం, నెలల తరబడి రెడ్ మీట్ మాత్రమే తినడం వారానికి రెండు సార్లు ఫిష్, బ్రెడ్ తప్పనిసరిగా భోజనంలో భాగంగా ఉండటం, తేనెలో నానబెట్టినవి, సాల్ట్స్ వాడనవి ఒరిజినల్ నట్స్ తినడం ఈ మెడిటరేనియన్ డైట్ లో భాగంగా ఉన్నాయి. ఈ డైట్ ఆరోగ్యాన్ని కాపాడుతుందనీ, మెదడు వృద్ధాప్యంలో కూడా అద్భుతంగా పనిచేస్తుందనీ, ఇక ఆ వయసులో వచ్చే మతిమరుపు భయాలకు కూడా దారని ఒక పరిశోధనలో స్పష్టమైంది. మెడిటరేనియన్ డైట్ కోసం మంచి సైట్స్ వున్నాయి వెతికి చూడండి. ఇది చాలా ప్రయోజనకారి.](https://vanithavani.com/wp-content/uploads/2017/01/mediterranean-diet.jpg)
ప్రత్యేకమైన డైట్ ,ఫిట్ నెస్ సుత్రాలు ఇవన్ని పక్కన ఉంటే లైఫ్ స్టయిల్ లో మార్పులు చేసుకుంటే బరువు తగ్గిపోవడం సులభం అంటారు ఆరోగ్య నిపుణులు.భోజనం రన్నింగ్ రేస్ లో కాకుండా తాపీగా తినాలి రాత్రి భోజనం రన్నింగ్ రేసులో కాకుండా తాపీగా తినాలి రాత్రి భోజనం తర్వాత ఏదో ఒకటి తినడం మానాలి.ఆర్ధరాత్రివరకు పనిచేస్తూ ఆ సమయంలో ఆకలి అనిపిస్తే ఫ్రిజ్ డోర్ తెరవడం మంచి పద్దతికాదు.ఆకలి అనిపిస్తే మితంగా నట్స్ డేట్స్ అంతే. ఆహారంలో కార్భో హైడ్రేట్స్ ఉంటూనే శరీరానికి మేలు జరుగుతుంది.తృణధాన్యాలతో చేసిన పదార్ధాలే తీసుకోవాలి.జ్యూస్ లు కూల్ డ్రింక్ లు బదులు నీళ్ళు తాగాలి.