గతాన్ని కళ్ళ ముందు ఉంచేది మ్యూజియం.ప్రపంచ వ్యాప్తంగా 202 దేశాల్లో 55వేల మ్యూజియంలు ఉన్నాయని ఒక అంచనా. అమెరికాలోని హాలివుడ్ కి చాలా దగ్గరలో ఉంది డెత్ మ్యూజియం. హంతకులు హతుల బొమ్మలు హతులు ఎంత ధారుణంగా ప్రాణం పోగొట్టుకునేది అలాగే దొరికిన హంతకుల కృరత్వం వారికి శిక్ష విధించిన వైనాలన్ని ఈ మ్యూజియంలో కనిపిస్తాయి. ఆత్మహత్యలు చేసుకున్న వారి పద్దతులు తర్వాత వారికి జరిగిన పోస్టుమార్టం వీడియోలు తీసి ఇందులో భద్రపరచాలి.ఆత్మహత్య సులభంగా చేసుకునేందుకు వీలుగా ఒక కెలోర్నియన్ అనే సుసైడ్ యంత్రం. స్వయంగా ప్రాణాలు తీసుకోవాలనుకుంటే పనికివచ్చే మెర్సిట్రాల్ యంత్రం కూడా ఇక్కడ చూడవచ్చు. ఇంత ధారుణమైన ఆలోచన ఎలా వచ్చింది. ఈ మ్యూజియం ఏమిటి అని ప్రయత్నిస్తే బతికి ఉండటం ఎంత అద్భుతమైన విషయమో ప్రపంచానికితెలిపేందుకుఈ మ్యూజియం పెట్టాం అన్నారట నిర్వాహకులు.