చక్కని తెలివైన సంతానం కావాలనుకుంటారు తల్లులు. తల్లి కడుపులో ఉండగానే యుర్ధతంత్రం విన్నాడట అభిమన్యుడు. ఇవి పురాణ కదలని కొట్టి పారేయకండి అంటున్నాయి అధ్యయినాలు. గర్బినీలు నిత్యం తమ కడుపులో వుండే శిశువుకి కధలు చెప్పి వినిపించాలంటున్నారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా వుండాలంటే, శిశువు మెదడు వృద్ది చెందటానికి ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ అవసరం. కాబట్టి సోయాబీన్స్, చేప, పాలకూర, వంటివి తల్లి నిత్యం తినాలి. అంతే కాదు నట్స్, వాల్ నట్స్, బాదాం వంటివి పొట్టలోని పాపాయి బ్రెయిన్ అభివృద్ధికి తోడ్పడతాయి. గర్బిణిలు మంచి ఫిట్ నెస్ తో వుండాలి. తప్పని సరిగా వాళ్ళు వ్యాయామం చేయవలసిందే. ఈ వ్యాయామాలు కడుపులోని బిడ్డకు ఆరోగ్యమే. పెరుగుతున్న బిడ్డకు తల్లి ఎదో ఒకటి మాట్లాడుతూ, పాటలు వినిపిస్తూ వుండాలి. పాటలకు శబ్దాలకు కడుపులోని బిడ్డ బాగా స్పందిస్తుంది, గర్భిణి స్త్రీలు సుప్ప్లిమెంట్స్ తీసుకోవాలి. డి-విటమిన్ చాలా అవరం కూడా ఇందుకోసం ఉదయపు ఎండలో కాసేపు నడిచినా మేలే.
Categories