ఎప్పుడు తియ్యని బొప్పాయి పండు గురించే ఆలోచిస్తాము కానీ పచ్చని బొప్పాయి ఆకుల గురించి మనస్సు పెట్టమని బొప్పాయి ఆకుల జ్యూస్ తో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది. అందకే డెంగ్యు జ్వరం వచ్చిన వారిని ఈ జ్యుస్ తాగమంటారు. బొప్పాయి ఆకుల్లో యాంటి మలేరియా గుణాలున్నాయి. వీటిలోని యాక్టోజెనిస్ విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. కాలేయం శుబ్రం చేయడం లో బొప్పాయి ఆకులూ క్లీనింగ్ ఏజెంట్ల లాగా పనిచేస్తాయి. ఈ జ్యూస్ వల్ల జీర్ణ క్రియ బాగా జరగడమే కాక, లివర్ సిరోసిన్, కాలేయ జబ్బుల్ని నివారిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పేగులల లోని, పొట్ట లోని మంటను తగ్గిస్తాయి. ఈ జ్యూస్ సెప్టిక్ అలర్జీలను తగ్గిస్తుంది. బొప్పాయి ఆకుల్లో విటమిన్-సి,ఎ లు పుష్కలంగా వున్నాయి. ఈ జ్యూస్ తో చర్మం ఆరోగ్యంగా వుంటుంది. అలాగే బొప్పాయి ఆకుల గుజ్జు తలకు ప్యాక్ లా వేసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. నేచురల్ కండిషనర్ లాగా పని చేస్తుంది. శిరోజాలు కాంతిగా మెరుస్తూ వుంటాయి.

Leave a comment