తెలంగాణ నుంచి చేనేత అభివృధి కోసం చేస్తున్న కృషికి గాను ప్రముఖ వ్యక్తి పురస్కారం అందుకున్నారు డాక్టర్ షర్మిలా నాగరాజ్. 30 ఏళ్ళ పాటు లెక్చరర్ గా విద్యార్థులకు చేనేతలు,వాటి సహజ రంగులు ప్రాచీన,ఆధినిక సాంకేతిక పద్ధతుల్లో హాండ్లూమ్స్ తయారీ గురించి పాఠాలు చెప్పిన షర్మిలా ఆరేళ్ల క్రితం కౌముది స్టూడియో ఏర్పాటు చేశారు. జాతీయ హస్తకళలు పునరుద్ధరించటం చేనేత కార్మికులను పునార్జింపచేయటం,చేనేత దుస్తుల కళను నిలుపుకోవటం లక్ష్యంగా కౌముది స్టూడియో పనిచేస్తుంది. దేశంలో అన్ని ప్రాంతాల్లో హస్తకళలున్నాయి. వాటిని బృందాలుగా ముందుకు తీసుకుపోవడం నా లక్ష్యం అంటారు డాక్టర్ షర్మిల నాగరాజ్.

Leave a comment