వ్యాపార రంగంలో మహిళలకు ప్రోత్సాహం తక్కువే. పైగా ఫలానా వ్యాపారం అయిటే ఆడవాళ్లకు సరిగ్గా సరిపోతుందనే సలహాలు వస్తున్నప్పుడు మల్లికా శ్రీనివాసన్ ను గుర్తు తెచ్చుకోవచ్చు. 2016లో బిబిసీ 100 శక్తివంతమిన మహిళల్లో ఒకరుగా ఆమెను గుర్తిస్తే అంతకంటే ముందే ఫోర్బ్స్ జాబితాలో ఆమె పేరుంది. ఇంతకీ ఆమె వ్యాపారం ట్రాక్టర్ల తయారీ భారతీయ ట్రాక్టర్ తయారీ మొఘల్ అంటారామెను. టాఫే, ట్రాక్టర్ అండ్ ఫార్మ ఎక్విప్ మెంట్ లిమిటెడ్ పరిశ్రమకు చైర్మాన్ గా, సి.ఇ.ఓ గా వ్యవహరిస్తూమల్లికా శ్రీనివాసన్ ని లాభాల భాటలో నడిపిస్తున్నారు. టాఫే ఇప్పుడు దేశంలో ట్రాక్టర్ల తయ్యారీలో రెండో స్ధానంలో ప్రపంచంలో మూడో స్ధానంలో నిలబడింది. ఈమె కృషికి ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది. సామాజిక సేవలో భాగంగా శంకర్ నీత్రాలయ, మద్రాస్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ కి అండగా నిలబడుతుంది మల్లిక.

Leave a comment