ఎన్ని నేర్చుకున్నా వంట విషయంలో ఇంకా తక్కువ నాలెడ్జ్ వుందనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి భోజనం చేసినా, ఎదో ఒక ప్రత్యేకత కనిపించి మనకెందుకు ఎంత జాగ్రత్తగా వండిన ఆ టెస్ట్ రాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు పులిహోర చేయాలంటే అన్నం పొడిపొడిగా వుండాలి. అన్నం ఉడికినప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం ఓ స్పూన్ నూనె వేస్తె అన్నం పొడిగా తెల్లగా వస్తుంది. క్యాబేజీ, కాలీ ఫ్లవర్, ఉడికినప్పుడు ఒకలాంటి వాసనా ఇబ్బంది పెడుతుంది. ఆ వాసన రాకుండా ఓ బ్రెడ్ ముక్క గానీ, ఓ స్పూన్ పంచదార గానీ వేయాలి. బెండకాయ ముక్కల్ని కష్ట వీయించి, తర్వాత ఉడకబెట్టి వండితే జిగట గా లేకుండా విడివిడిగా ఉంటాయి ముక్కలు . కూర లో ఉప్పు ఎక్కువైతే రెండు స్పూన్ల పాల మీగడ కలిపితే ఆ ఉప్పదనం పోయి కూర చాలా రుచిగా వుంటుంది. మామూలు కూరలు ఇలా పాల మీగడ కలిపినా కూరలు రుచి వస్తుంది.
Categories