నీహారికా,

ఆడపిల్లలు, మగపిల్లలు అనే తేడా లేకుండా పిల్లలంతా తల్లికే చేరికగా ఉంటారానుకుంటాం, కానీ ఈ తరం పిల్లలకు నాన్నంటే  తమ వెంట వెన్నంటే నీడలాంటి వాడని భావన. ఒక సర్వేలో తండ్రులు తమతో ఎంతగా మమేకం అయితే అంతగా పిల్లలు అనందిసున్నారట. మారిన జీవన శైలి నాన్న కుడా అమ్మలాగే పిల్లల ఆలనా పాలనా విషయంలో చక్కగా శ్రద్దగా వుంటున్నారు. కాకపొతే వుద్యోగం చేసే అమ్మలకు తాము దగ్గర లేనప్పుడు నాన్న పుల్లను తమలాగా చుదగాలరో లేదోనాన్న భయం, అయితే ఎక్స్ పార్ట్స్ అమ్మలకే సలహా ఇసున్నారు. తండ్రులకు అప్పగించిన పిల్లల బాధ్యతను వారి స్టయిల్ లోనే చేయనిమ్మంటున్నారు. అప్పుడే నాన్న తాము చేపట్టిన కొత్త బాధ్యతను చక్కగా చేస్తారట. ఈ సరికొత్త కాలపు సమాజంలో ఈ తరం దంపతులు ఎదుర్కుంటున్న అనుభవాలు ఇవి. నాన్న కుడా అమ్మలాగా పిల్లలను ప్రేమాభిమానాలతో ముంచెత్తడం, పిల్లల్ని అమ్మలాగే చుడుకోవడం. పిల్లలను ప్రయోజికులను చేయడం లో ఇద్దరు సమానమైన పాత్ర పోషించడం ఆహ్వానించ దాగిన విషయమే కదా!

Leave a comment