గ్రీన్ జ్యూస్ లా వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది ఇవి తాజాగా ఉండటం తో పాటు సేంద్రియమైనవి. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. బరువు తగ్గించడంలో అద్భుతంగా తోడ్పడతాయి. కూరగాయల రసం శరీరంలో డిటాక్స్ గా చేస్తుంది. పచ్చని కూరగాయలు శరీరాన్ని ఆక్సిజన్ రేట్ చేస్తాయి. పళ్ళ రసాల తో పోలిస్తే గ్రీన్ జ్యూస్ లో చక్కెర తక్కువ. నీళ్లు ఫైబర్ ఎక్కువ. ద్రవరూపంలో ఉంటాయి కనుక సులభంగా జీర్ణం అవుతాయి. రుచికోసం కలిపే అల్లం, సైంధవలవణం, మిరియాలు, నిమ్మరసం మొదలైనవి జీర్ణక్రియకు మేలు చేస్తాయి. వీటిని ఆహారంతో మాత్రమే తీసుకోవాలి ఆహారానికి ప్రత్యామ్నాయం ఈ రసాలు కానేకావు.

Leave a comment