1931వ సంవత్సరంలో ఓహియో నగరంలో జన్మించిన టోనీ మోరిసన్‌ తండ్రి వెల్డరు, తల్లి ఆధ్యాత్మిక స్త్రీ, చర్చి గాయక బృందం లో పాటలు పాడేవారు.టోనీ వయస్సు పెరుగుతున్న కొద్దీ అమెరికాలోని దక్షిణ ప్రాంతపు జాత్యహంకారం అనుభవం లోకి రావటం మొదలైంది కాలేజీ కి వెళుతున్న రోజుల్లో వాషింగ్టన్‌ బస్సులలో ‘శ్వేతేతరుల కోసం’ అని రాసి ఉండటం ఆమెకు ఆగ్రహం కలిగింది. తెల్లవారి వైఖరిని తిప్పి కొట్టాలన్నదే ఆమె రచనల కు ప్రేరణ. 1955లో కోర్నెల్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. పూర్తి చేసింది. వర్జీనీయా వూల్ఫ్‌, విలియం ఫాల్కనర్‌, టాల్‌స్టాయ్‌, డోస్టొవెస్కీ, సాహిత్య ప్రభావం ఆమెపై ఉంది.  ఆఫ్రో`అమెరికన్‌ సాహిత్య భాషను సృష్టించిన రచయిత్రి టోనీ.ఆమె కాల్పనిక శక్తికి, కవితా ధోరణి లో నవలలు రాసినందుకు 1993 లో నోబెల్‌పురస్కారం పొందింది. నోబెల్ గ్రహించిన తోలి నల్లజాతి మహిళ   టోనీ మోరిసన్‌.

Leave a comment