హేర్తా మ్యూలర్‌ రుమేనియాకు చెందిన రచయిత్రి.హేర్తా జర్మనీ మాట్లాడే అల్పసంఖ్యాకులు నివసించే రుమేనియాలోని నిచిటార్ఫ్‌ అనే పట్టణంలో 1953 వ సంవత్సరం లో రైతు కుటుంబంలో జన్మించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ల స్టాలిన్‌ నిర్బంధ కార్మిక శిబిరాల్లో ఉంచాక హేర్తా తల్లి కార్మిక శిబిరాల్లోనే జీవించింది.హేర్తా చదువు పూర్తిచేశాక,తండ్రి మరణం,బ్రతుకు తెరువు కోసం తల్లి కూలీగా పనిచేయడం చూశాక తనను తాను ఓదార్చు కొనేందుకు రచనలు సాగించింది. కొన్నాళ్ళు టీచర్ గా పని చేసింది.  ద పాస్‌పోర్ట్‌, ట్రావెలింగ్‌ ఆన్‌ వన్‌ లెగ్‌, ద ఫాక్స్‌ వాజ్‌ ద హంటర్‌, ద అపాయింట్మెంట్‌ మొదలైనవి ఆమె ప్రసిద్ధ రచనలు.వంచనకు గురైన వారి జీవన చిత్రాలను వివరిస్తూ పుస్తకాలు రాసినందుకు గాను 2009 లో ఆమెకు నోబెల్ ప్రదానం చేసింది.

Leave a comment