ఇల్ఫ్రీడే ఇయెలినెక్‌ ఆస్ట్రియా రచయిత్రి. ఈమె 1946వ సంవత్సరంలో ఆస్ట్రియా దేశంలో జన్మించింది. తండ్రి యూదు ఇల్ఫ్రీడే ని తల్లి సంగీతకారిణినితీర్చి ద్దిదాలనుకొన్నది. ఆ లక్ష్యం కోసం చాలా కఠినంగా వ్యవహరించేది. కానీ ఇల్ఫ్రీడేరచయిత్రి అయింది.ఆమె ప్రసిద్ధ రచనలు వర్‌ డెకోస్‌ బేబి, ఉమెన్‌ యాజ్‌ లవర్స్‌, వండర్‌ఫుల్‌ టైమ్స్‌, ద పియానో టీచర్‌ మొదలైనవి. స్రీల మధ్య సంబంధాలు, యజమానులు బానిసల వంటివని, ఎక్కడైతే స్త్రీలు తమ యవ్వనం, అందం, దేహం మూలంగానే కేవలం శక్తిమంతులుగా చూడబడతారో, పురుషులు తమ పని, కీర్తి లేదా సంపద ద్వారా తమ లైంగిక విలువలను పెంచుకుంటారో, అక్కడ ఏ మార్పూ ఉండదని ఆమె విశ్వసించింది. ఆమె రచనెలకు గుర్తింపుగా 2004లో నోబెల్‌బహుమతి ఆమెని వరించింది.

Leave a comment