మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వాన్ని ప్రతి ఫలిస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్. తెలుపు రంగును ప్రేమించే వారు మృదు స్వభావంతో ప్రతి విషయం స్పష్టమైన వైఖరితో ఉంటుందిట. నలుపు రంగు బలమైన వ్యక్తిత్వానికి చిహ్నం. ఎవరి ఆధిపత్యాన్ని భారిచలేరు. ఎరుపును ఇష్ట పడే వారు స్వాభిమానం తో వుంటారు శక్తి సమాధ్యాలు ఎక్కువే. తమకన్నా గొప్పవారు లేరనుకుంటారట. నీలం రంగు నచ్చితే నిలకడగా , నిజాయితీగా వున్నారనుకోవచ్చు. తొందర పడకుండా నిదానంగా ముందుకు సాగుతారు. ఇక పసుపు రంగు ఉత్సాహంగా ఉల్లాసంగా వుండే వారు ఇష్టపడతారు. అందరు పసుపు ఎరుపు కలయికా వుండే ఆరెంజ్ రంగుని ఇష్టపడే వారు మంచి మాటకారులు. పొడుపుగా గడిపేందుకు ఇష్టపడతారు. ఇక గులాబీ రంగుని అందంగా చిలిపిగా వుండే వాళ్ళు కోరుకుంటారు. ప్రతి పని ఖచ్చితంగా వుండేవాళ్ళకి గులాబీ అంటే ఇష్టం.

Leave a comment